Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్కీ అతుల్ ఆత్మహత్య - పరారీలో భార్య... అత్త అరెస్టు

atul subhash

ఠాగూర్

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (12:43 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగుళూరు టెక్కీ అతుల్ సుభాష్ (34) ఆత్మహత్య కేసుపై పోలీసులు దృష్టించారు. దీంతో అతుల్ భార్య పరారీగా, ఆమె తల్లి, సోదరుడుని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. భార్య సతాయింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు టెక్కీ 40 పేజీల సూసైడ్ నోట్, 90 నిమిషాల వీడియో రికార్డు సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఈ సూసైడ్ నోట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు సుప్రీంకోర్టుకు కూడా అతుల్ పంపించాడు. భార్యల నుంచి వేధింపులకు గురవుతున్న భర్తలకు రక్షణ కల్పించాలని కోరాడు. తన భార్య, అత్తింటివారితో పాటు తన ఆత్మహత్యతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయాలని కోరాడు. విడాకుల సెటిల్‌మెంట్ కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేయగా, జడ్జి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. 
 
అతుల్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సెక్షన్ 498ఏ పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ సెక్షన్ దుర్వినియోగమవుతున్నట్టుగా చెబుతూ విచారం వ్యక్తం చేసింది. భరణం విషయంలో 8 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా రంగంలోకి దిగిన కర్నాటక పోలీసులు అతుల్ అత్త నిషా సింఘానియా, ఆయన బావమరిది అనురాగ్ సింఘానియాను గత రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతుల్ భార్య నికిత సింఘానియా కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి శుక్రవారం బెంగుళూరుకు తరలించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియాపై దాడి.. లిఖితపూర్వక క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు