Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ నటి నవనీత్ కౌర్‌పై దాడికియత్నం ... 45 మంది అరెస్టు

Advertiesment
navneet kaur

ఠాగూర్

, సోమవారం, 18 నవంబరు 2024 (09:30 IST)
బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దరియాపూర్‌లో జరిగింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల చేస్తుండగా, ఒక్కసారిగా కొందరు దుండగులు ఆమెపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి దండుగలను చెదరగొట్టారు. దీనిపై ఖల్లార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి 45 మందిని అరెస్టు చేశారు. 
 
ఈ దాడి ఘటన తర్వాత నవనీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, ఖల్లార్‌లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు. ప్రచార సభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు. వారంతా ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేస్తూ తమను దుర్భాషలాడారని పేర్కొన్నారు. మరికొందరు ఉమ్మి కూడా వేశారని, ఆ సమయంలో తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డుగా నిలబడి తనను రక్షించారని నవనీత్ కౌర్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)