Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ కృష్ణ ఆరోగ్యం కోసం దేవుడ్ని ప్రార్థించండి : హీరో నరేశ్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (20:50 IST)
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర సేవల విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై సీనియర్ నటుడు, కృష్ణ తనయుడు నరేష్ స్పందించారు. తన తండ్రి కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం విషమంగానే ఉందనీ, శ్వాస తీసుకుంటున్నారని వెల్లడించారు. రేపు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరగవుతుందని భావిస్తున్నామని తెలిపారు. 
 
కృష్ణ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ధైర్యశాలి, సాహసవంతుడు అని కొనియాడారు. ఆయన ఓ పోరాట యోధుడని, ఈ పరిస్థితి నుంచి క్షేమంగా బయటకి వస్తారని నమ్ముతున్నామని తెలిపారు. కృష్ణగారి ఆరోగ్యం కోసం ఆయన అభిమానులంతా దేవుడిని ప్రార్థించండి అని నరేష్ పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, కృష్ణ ఆరోగ్యంపై మరోమారు ఆస్పత్రి వైద్య వర్గాలు స్పందించాయి. కృష్ణకు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయని, తాము అందిస్తున్న ప్రపంచ స్థాయి వైద్యం పట్ల కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. 
 
24 గంటలు గడిస్తేనేగానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని చెప్పారు. ప్రస్తుతం కృష్ణకు ఎనిమిది మందితో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్టు కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments