Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌజ్‌లో పవన్, నాని.. ఓన్లీ వన్స్ ఫసక్... శ్రీరెడ్డి

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (18:20 IST)
గత ఏడాది తెలుగు బిగ్ బాస్ షోలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి పాల్గొనాల్సింది. కానీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని.. శ్రీరెడ్డి ఎంట్రీని అడ్డుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళం బిగ్‌బాస్-3లో శ్రీరెడ్డిని తీసుకునేందుకు దాదాపు లైన్ క్లియర్ అయిందంటూ ప్రస్తుతం జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇలాంటి తరుణంలో శ్రీరెడ్డి ఓ ఆసక్తికర పోస్టు చేసింది. సోషల్ మీడియాలో మీలో ఎంతమంది బిగ్‌బాస్‌లో తనను చూడాలనుకుంటున్నారని ప్రశ్నించింది. తెలుగు, తమిళ బిగ్‌బాస్‌ రెండింటిలో ఏది తనకు కరెక్ట్ అని అడిగింది. 
 
దీనిపై ఓ నెటిజన్ స్పందించాడు. ''నీకు రాణించే సామర్థ్యం ఉంటే.. నేను నీకు సపోర్ట్ చేస్తా.. తెలుగు బిగ్‌బాస్ షోలో నిన్ను చూడాలనుకుంటున్నా'' అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి.. కాంపిటీటర్స్‌గా పవన్‌కళ్యాణ్, అభిరామ్, నాని, మురుగదాస్, శ్రీకాంత్... ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ తన స్టైల్లో కామెంట్ చేసింది.
 
ఇంతటితో ఆగలేదు. తాను బిగ్‌బాస్‌లో వుంటే ఫుల్ సెన్సార్ ప్రాబ్లమ్ అంటూ కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి శ్రీరెడ్డికి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే ఆప్షన్ వుంటుందో లేదో వేచి చూడాలి. 
 
అంతేగాకుండా.. క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీరెడ్డి సపోర్ట్ చేసిన దర్శకుడు తేజపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. ''రేపు తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా'' అంటూ వరుస పోస్ట్‌లు వదిలింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments