Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యగ్రహణం పట్టినప్పుడు గుంటలో కూర్చుంటే అంగవైకల్యం తగ్గుతుందనీ...

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (18:21 IST)
సూర్యగ్రహణం సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసు కుంది. చిన్నారులకు అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో చిన్నారులను మట్టిలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యగ్రహణం సమయంలో మట్టిలో పాతి పెడితే చిన్నారుల అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రులకి ఎవరో చెప్పగా అది నిజమే అనుకున్నారు. మట్టిలో పాతిపెడితే మంచిదని అలా చేయడం వలన వారి అంగవైకల్యం పోవచ్చనే నమ్మకంతో మట్టిలో పాతిపెట్టారు. 
 
అంగవైకల్యం కలిగిన పిల్లలను గొంతు వరకు మట్టిలో కప్పి పెట్టారు తల్లిదండ్రులు, స్థానికులు.
 ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని తాజ్‌సుల్తాన్‌పురాలో చోటుచేసుకుంది. పిల్లలు రోదిస్తున్నప్పటికీ గ్రహణం ముగిసే వరకు అంటే సుమారు మూడు గంటల పాటు పిల్లలను వారి తల వరకు మట్టిలోనే కప్పి ఉంచారు. అయితే ఉత్తర కర్ణాటక అంతటా ఇదే మూఢాచారం కొనసాగుతోందట. 
అయితే ఈ ఘటన పైన జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేసింది. చిన్నారులను మట్టిలో పాతిపెడితే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడతారని అన్నారు. తల్లిదండ్రులు ఈవిధమైన మూఢ విశ్వాసాలను విడనాడాలని సూచిస్తున్నారు. స్థానికులకు ఈ మూఢ నమ్మకం నుంచి బయట పడేసేందుకు అనేకమంది ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments