Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంగు చాచి అడుగుతున్నావా..? షర్మిల నీ డ్రామాను ఆపు.. వైఎస్సార్ సోదరి

సెల్వి
శనివారం, 13 ఏప్రియల్ 2024 (12:58 IST)
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకత్వానికి వైఎస్‌ షర్మిల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన షర్మిల ప్రస్తుతం కడపలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య అంశంపై ఆమె పదేపదే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారు.
 
ఈ విషయంపై మాట్లాడిన షర్మిల.. వివేకానందరెడ్డి హత్య అంశంపై తీర్పు చెప్పాలని కడప ఓటర్లను అభ్యర్థించడంతో భావోద్వేగానికి గురయ్యారు. హత్యకేసులో న్యాయమైన తీర్పు కోసం పోరాడుతున్న తనకు హంతకులను మద్దతివ్వవద్దని కడప ఓటర్లను ఆమె భావోద్వేగంతో వేడుకున్నారు. ఆమె తన చీర కొంగు చాచి అడుగుతున్నాను. తనకు న్యాయం చేయండి అని ఓటర్లను వేడుకున్నారు. 
 
ఓటర్లకు షర్మిల ఉద్వేగభరితంగా అభ్యర్ధించిన మరుసటి రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు, షర్మిల మేనత్త వైఎస్ విమలమ్మ షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల, సునీత తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ వివేకానందరెడ్డిని అసలు హంతకులతో జతకట్టి జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. షర్మిల, సునీతలను వైఎస్ కుటుంబంలో కానీ, సామాన్య ప్రజల్లో కానీ పట్టించుకునే వారు లేరని, ఈ డ్రామాలు ఆపాలని, వెంటనే ప్రజలు వారి నోరు మూయించాలని ఆమె కోరారు.
 
వైఎస్ కుటుంబానికి చెందిన బద్ధ ప్రత్యర్థులు షర్మిలను చుట్టుముట్టారని, వాళ్ల మాటలకు షర్మిల ఆడుతోందని విమలమ్మ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక నుంచి షర్మిల, సునీతలకు వెన్నుదన్నుగా నిలిచే ఉద్దేశం వైఎస్‌ కుటుంబంలో ఎవరికీ లేదని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments