Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివేకాను చంపిందెవరో పులివెందుల పూల అంగళ్ల వద్ద పంచాయతీ పెడదాం: షర్మిల సవాల్

Advertiesment
YS Sharmila

ఐవీఆర్

, శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (23:43 IST)
వైఎస్ షర్మిల కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆమెతో గొడవకు దిగారు. దీనితో షర్మిల మైకు అందుకుని వారికి సవాల్ విసిరారు.
 
" బాబాయి వివేకాను హత్య చేసిందెవరో బయటకు వచ్చేసింది. ఐనా మీరు దీనిపై గొడవ చేస్తే... ఇక్కడ కాదు, పులివెందుల పూల అంగళ్ల వద్ద తేల్చుకుందాం. పంచాయతీ పెడితే బాబాయిని హత్య చేసిందెవరో తెలుస్తుందన్నారు. హంతకుడికి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారు. అలాంటివాడు చట్టసభల్లోకి రాకూడదనే ఉద్దేశ్యంతో నేను కడప నుంచి బరిలోకి దిగా.
 
ధర్మం, న్యాయం, నీతి పుష్కలంగా నాలో వున్నాయి. గతంలో జగన్ నాకు అన్న. ఇప్పుడ కేవలం ఏపీ సీఎం. ఆయన సీఎం అయిన దగ్గర్నుంచి ఆయనతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నేను నా చినతండ్రి హత్య చేసిన వారిని చట్టసభల్లో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశ్యంతో నేను పోటీ చేస్తున్నా. కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభకు భారీగా తరలివచ్చిన నా పులివెందుల ప్రజలకు,కార్యకర్తలకు, అభిమానులకు,నాయకులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు.
 
పులివెందులకు మేం వస్తున్నామని తెలిసి లైట్లు తీశారు. లైట్లు అసలు ఉండవంటే సీఎంగా జగన్ ఫెయిల్ అయినట్టు. లైట్లు కావాలని తీశారంటే అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్టు. జగనన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో ఒక్క హామీ నెరవేరలేదు.. పులివెందుల బిడ్డ కనీసం ఒక రాజధాని కూడా కట్టలేక పోయాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగున్నర ఏళ్లుగా కోటలో నిద్రపోయాడు.

కుంభకర్ణుడు లెక్క నిద్ర లేచి డీఎస్సీ అంటూ హడావిడి చేస్తున్నాడు. నిషేదం పేరు చెప్పి కల్తీ బ్రాండ్ అమ్ముతున్నారు. కొంగు చాచి మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ.. మరోవైపు హంతకుడు. ఒక వైపు న్యాయం ఉంది. మరోవైపు ధర్మం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో.. ప్రజలు తేల్చుకోవాలి. ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాను అని ముగించారు షర్మిల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, షెల్ భాగస్వామ్యం