Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ... సెలెబ్రిటీ ఐతే.. మృతదేహం అయినా పర్వాలేదా?

టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి నందమూరి అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూ

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:55 IST)
టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి నందమూరి అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరులో స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళ్తుండగా నల్గొండలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన వారిని అక్కిడికి దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ కన్నుమూశారు. 
 
కాగా సదరు ప్రైవేటు ఆస్పత్రిలో సిబ్బంది చేసిన ఓ నిర్వాకం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. విమర్శలకు దారితీస్తోంది. హరికృష్ణ లేరనే విషయాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే.. ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం మృతదేహంతో సెల్ఫీ దిగారు. అది కూడా నవ్వుకుంటూ ఫోటోకి ఫోజ్ ఇచ్చి మరీ దిగారు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీ ఐతే.. మృతదేహం అయినా పర్వాలేదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మానవీయ విలువలు దిగజారిపోయాయనేందుకు ఈ ఫోటోనే నిదర్శనమని ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments