Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు రేప్.. వ్యభిచారం కూడా..?

బాలికలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు కామాంధులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... మైసూరులోని ఉదయగిరికి చెందిన ముగ్గురు అమ్మాయిలు

Advertiesment
ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు రేప్.. వ్యభిచారం కూడా..?
, గురువారం, 19 జులై 2018 (18:43 IST)
బాలికలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు కామాంధులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... మైసూరులోని ఉదయగిరికి చెందిన ముగ్గురు అమ్మాయిలు కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వారు ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. 
 
పెద్దమ్మాయి వయసు 18 ఏళ్లు కాగా, రెండో అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. మరో అమ్మాయికి పదహారేళ్లు. కుమార్తెలు కనిపించట్లేదని.. బాలికల తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఒడనాడి సేవా సమస్థే (ఓఎస్‌ఎస్‌) స్వచ్ఛంద సంస్థ దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆ బాలికలకు పొరిగింటివాడు డబ్బుపై ఆశచూపాడు. 
 
డబ్బు, ఇతర సదుపాయాలు ఆశజూపి బెంగళూరు, మంగళూరు మాండ్య ప్రాంతాలకు తిప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు ఆ అక్కాచెల్లెళ్లపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఒక్కోసారి వారితో బలవంతంగా వ్యభిచారం కూడా చేయించారని తెలిసింది. నిందితుల్లో ఒకడైన అబన్‌(30)ను అరెస్టు చేశారు. మిగిలిన వ్యక్తులు పరారీలో వున్నారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలిని ఆరుగురితో రేప్ చేయించిన ప్రియుడు.. ఎక్కడ?