Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేప్‌ల భారతం : ఇది 'రిపబ్లిక్ ఇండియా' లేదా 'రేప్‌ పబ్లిక్' దేశమా?

ప్రపంచంలో వేదభూమిగా పేరుగాంచిన భరతగడ్డ కొందరు మృగాళ్ళు, కామాంధుల కారణంగా అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. 2014-16 సంవత్సరాల మధ్యకాలంలో ఏకంగా లక్షకు పైచిలుకు మానభంగాలు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్

Advertiesment
రేప్‌ల భారతం : ఇది 'రిపబ్లిక్ ఇండియా' లేదా 'రేప్‌ పబ్లిక్' దేశమా?
, గురువారం, 19 జులై 2018 (14:28 IST)
ప్రపంచంలో వేదభూమిగా పేరుగాంచిన భరతగడ్డ కొందరు మృగాళ్ళు, కామాంధుల కారణంగా అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. 2014-16 సంవత్సరాల మధ్యకాలంలో ఏకంగా లక్షకు పైచిలుకు మానభంగాలు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా వెల్లడించింది. ఈ పరిణామం ప్రతి పౌరుడు తలదించుకునేలా చేస్తోంది.
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు సమాధానమిస్తూ, దేశ్యాప్తంగా 2014-16 మధ్య ఏకంగా 1,10,333 అత్యాచార కేసులు నమోదైనట్లు సభకు తెలిపారు. 2014లో 36,375 కేసులు, 2015లో 34,561 కేసులు, 2016లో 38,947 కేసులు నమోదైనట్లు వివరించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. 12 ఏళ్లు, ఆ లోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. ప్రతిపాదిత బిల్లు త్వరలోనే లోక్‌సభ ముందుకు రానున్నట్టు వివరించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛ... ఛ... ధోనీ బంతి తీసుకుంటేనే అంత గొడవ చేస్తారా? రవిశాస్త్రి ఆగ్రహం