Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలు.. 12 ఏళ్ల కుర్రోడు.. ఆంబులెన్స్‌కు అలా దారి చూపాడు..

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:43 IST)
వరద ఉధృతి, అంబులెన్స్ వచ్చేస్తోంది. కానీ వయస్సులో చిన్నవాడైనా ధైర్యంతో ముందుకెళ్లాడు. అంతేగాకుండా వరదలతో మునిగిపోయిన బ్రిడ్జిపై ధైర్యంగా ముందుకు దాటుతూ అంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఇదంతా చేసింది.. 12 ఏళ్ల బాలుడు మాత్రమే. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్ చూర్ జిల్లాలోని దేవదుర్గ తాలుకాలో హిరేరాయంకుంపీ గ్రామంలో ఓ బ్రిడ్జి వరద నీటితో మునిగిపోయింది. రోడ్డంతా మునిగిపోవడంతో బ్రిడ్జి దాటేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. 
 
బ్రిడ్జీ ఎక్కడ వరకు ఉందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడే ఓ ఆంబులెన్స్ అదే బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ వరద నీరు కారణంగా బ్రిడ్జి దాటేందుకు ఆంబులెన్స్ ముందుకెళ్లలేదు. మధ్యలో వరదనీరు పొటెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. 
 
ఇంతలో 12ఏళ్ల వెంకటేశ్ అనే బుడ్డోడు అక్కడికి చేరుకున్నాడు. వెంటనే తానున్నాను పదా అంటూ ధైర్యంగా ముందుకు సాగాడు. నీటిలో పడుతూ లేస్తూ ముందుకు నడుస్తూ ఆంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఆ బుడ్డోడిని అనుసరిస్తూ అంబులెన్స్ ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా వెంకటేశ్ చేసిన సాహసానికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments