Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజశేఖర్ అలాంటి పని చేశారంటే ఎవరైనా నమ్ముతారా?: రోజా

యాంగ్రీ మ్యాన్, గరుడ వేగ హీరో రాజశేఖర్‌కు ఆయన సతీమణి, నటి, దర్శకురాలు జీవితపై సామాజిక కార్యకర్త, పీవోడబ్ల్యూ సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. భర్త రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను సప్లై చేసేదని, హాస్టళ్లలోని

Webdunia
శనివారం, 5 మే 2018 (16:58 IST)
యాంగ్రీ మ్యాన్, గరుడ వేగ హీరో రాజశేఖర్‌కు ఆయన సతీమణి, నటి, దర్శకురాలు జీవితపై సామాజిక కార్యకర్త, పీవోడబ్ల్యూ సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. భర్త రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను సప్లై చేసేదని, హాస్టళ్లలోని అమ్మాయిలను ట్రాప్ చేసి భర్త లైంగిక కోరికలను తీర్చడానికి పంపేదని సంధ్య ఆరోపించారు. 


ఈ ఆరోపణలపై జీవిత కూడా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని కూడా సంధ్య చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. 
 
రోజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజశేఖర్ అలాంటి వారు కాదని చెప్పింది. ఏదైనా విషయం వుంటే.. అది ఒకటి రెండేళ్లలో వెలుగులోకి వస్తుంది. కానీ రాజశేఖర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్ని సంవత్సరాలైంది. తాను కూడా రాజశేఖర్‌తో కలిసి సినిమాలు చేశాను. జీవిత లేకుండా రాజశేఖర్‌ బయటకు కూడా వెళ్లరు. 
 
అలాగే పిల్లల్ని వదిలిపెట్టి అస్సలు బయటకు వెళ్లరు. అలాంటి మనిషి ఇలాంటి పని చేశాడంటే ఎవ్వరూ నమ్మరంటూ రోజా వ్యాఖ్యానించారు. కావాలనే రాజశేఖర్‌‌ను టార్గెట్ చేసి.. ఇలాంటి ఆరోపణలు చేసివుంటారని రోజా తెలిపారు. రాజశేఖర్ మా ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు. రాజశేఖర్‌పై కావాలనే బురద చల్లారని.. ఈ ఆరోపణలను బట్టి అర్థం చేసుకోవచ్చునని రోజా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం