Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాచేపల్లి నిందితుడు వైసీపీకి చెందిన వ్యక్తి.. రోజా బరితెగించిన మహిళ: యరపతినేని

దాచేపల్లి ఘటనపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆడవారి మానప్రాణాలు కాపాడే వారే లేరా? ముఖ్యమంత్రి టెక్నాలజీ అంటూ ఉంట

Advertiesment
దాచేపల్లి నిందితుడు వైసీపీకి చెందిన వ్యక్తి.. రోజా బరితెగించిన మహిళ: యరపతినేని
, శనివారం, 5 మే 2018 (12:58 IST)
దాచేపల్లి ఘటనపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆడవారి మానప్రాణాలు కాపాడే వారే లేరా? ముఖ్యమంత్రి టెక్నాలజీ అంటూ ఉంటారు.. అత్యాచారాలను అడ్డుకోలేరా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
హోమ్ మంత్రి హోంలో కూర్చునే మంత్రిగా మారిపోయారని.. పోలీసులు టీడీపీ బౌన్సర్లుగా తయారయ్యారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో అధికార పార్టీ నేతల పాత్రను ప్రజలు కళ్లారా చూశారని రోజా ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.
 
ఈ నేపథ్యంలో దాచేపల్లి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఖండించారు. రోజాను మహిళ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉందని మీడియాతో మాట్లాడుతూ.. యరపతినేని అన్నారు. రోజా బరితెగించిన మహిళ అని.. ఒక శాసనసభ్యురాలై ఉండి.. అసెంబ్లీ సాక్షిగా "నన్ను దమ్ముంటే రేప్ చేయండి'' అని మాట్లాడిన వ్యక్తి అంటూ గుర్తు చేశారు. 
 
అలాంటి వ్యక్తి ఏపీ సీఎ చంద్రబాబు గురించి, సర్కారు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య వైసీపీకి చెందిన వ్యక్తి. ప్రతిపక్షంలో ఉండి అకృత్యాలకు పాల్పడటం, అత్యాచారాలు చేయడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం దారుణమన్నారు. వైసీపీకి గానీ, రోజాకు గానీ ఏ సంఘటన గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోర్న్ ఫిలిమ్స్ వల్ల చెడిపోతున్నారు... సీఎం చంద్రబాబు