Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేసిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్.. ఎందుకు?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (12:42 IST)
కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌లో ప్రయాణించారు. తద్వారా తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ యుద్ధవిమానం గురువారం ఉదయం 9.58కి బెంగళూరులోని హెచ్ఏఎల్ నుంచి బయల్దేరి 30 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. 
 
కాగా బయల్దేరే ముందు 45 స్క్వాడ్రన్‌ ఫ్లయింగ్ డాగర్స్‌కు చెందిన పైలట్లు విమానం గురించి రాజ్‌నాథ్‌కు పరిచయం చేశారు. ఏవియానిక్స్, నియంత్రణ, రాడార్, గ్లాస్ కాక్‌పిట్లతో పాటు యుద్ధంలో ఇది మోసుకు పోయే ఆయుధాలను కూడా వివరించారు.
 
ఈ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన తర్వాత రాజ్‌నాథ్ స్పందిస్తూ, 'యుద్ధ విన్యాసానికి సన్నద్ధమయ్యా' అని వ్యాఖ్యానించారు. జీ-సూట్ వేసుకున్న ఫొటోలు షేర్ చేశారు. కాగా, విమానంలో చక్కర్లు కొట్టిన అనంతరం డీఆర్‌డీవో చీఫ్ డాక్టర్ సతీశ్ రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ మీడితో మాట్లాడారు. 
 
'కొద్దిసేపు రక్షణమంత్రి కూడా తేజస్‌ని నియంత్రిస్తూ నడిపించారు' అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రాజ్‌నాథ్ కలగజేసుకుంటూ.. 'పైలట్ తివారీ ఎలా చెబితే అలా నడుపుతూ వచ్చాను.. ఏ సమస్యా ఎదురు కాలేదు' అని అని పేర్కొనడంతో అందరి ముఖంలో నవ్వులు విరిశాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments