Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు కాబోయే సీఎం రజనీకాంతే.. పార్టీల్లో వణుకు.. సయోధ్యకు బీజేపీ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కాబోతున్నారని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయని స

Webdunia
ఆదివారం, 13 మే 2018 (16:31 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కాబోతున్నారని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయని సర్వే నివేదికను ప్రచురించడం సంచలనం రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ప్రభంజనం సృష్టిస్తారని సర్వే తేల్చేసింది. 
 
అంతేగాకుండా తమిళనాడుకు రజనీకాంతే సీఎం కావడం తథ్యమని సర్వే ద్వారా వెల్లడి అయ్యింది. దీంతో తమిళ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కథనంపై అధికార అన్నాడీఎంకేలో ఇప్పటికే విపరీతమైన చర్చ నడుస్తున్నట్లు సమాచారం. 
 
రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రజనీ ప్రకటించి.. చాలారోజులైనా.. ఇప్పటిదాకా పార్టీ పేరు, విధానాలను సూపర్ స్టార్ వెల్లడించలేదు. అయితే రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ సినిమా విడుదలైన తర్వాత రజనీ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారిస్తారని ఓ పత్రిక వెల్లడించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని సమాచారం. మరోవైపు రజనీకాంత్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments