రాహుల్ జీ, డీఎస్‌ను చేర్చుకోవడం వేస్ట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇగో హర్టయ్యిందా?

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (15:27 IST)
రాజకీయ శేషజీవితం కాంగ్రెస్ పార్టీలో గడిపేద్దాం అనుకున్న ధర్మపురి శ్రీనివాస్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు గట్టిగా ఆయన చేరికకు అడ్డు తగిలినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి కారణం వుందని పొలిటికల్ సర్కిళ్లలో వాదనలు వినిపిస్తున్నాయి.

 
కనీసం మాటమాత్రం తమతో చర్చించకుండా నేరుగా సోనియా వద్ద మంతనాలు జరిపి పార్టీలోకి దర్జాగా రావాలని డీఎస్ చేయడంపై టి.నాయకులు జీర్ణించుకోలేకపోయారట. మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీని డీఎస్ కుటుంబం సోనియాను, రాహుల్ గాంధీని తూర్పారబట్టారనీ, ఇపుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన చేరుతారు? ఏ ముఖం పెట్టుకుని ఆయనతో కలిసి మేము పనిచేస్తాము? అంటూ నేరుగా రాహుల్ గాంధీ వద్దే పంచాయతీ పెట్టారట.

 
నియోజకవర్గ పరిధిలో డీఎస్ చేరికకు ఎవ్వరూ ఆసక్తి చూపకపోగా, డీఎస్ చేరితే పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారట. దీనితో అధిష్టానం ఈ విషయంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద పార్టీలో చేరి శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకున్న డీఎస్‌కి షాక్ తగిలినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments