ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వకుండా.. వారిపై పెట్టిన పోలీసు కేసులను వెనక్కి తీసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. ప్రధాని ఇంకెన్ని సార్లు క్షమాపణలు చెబుతారు? అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే రైతు అంశంపై లోక్ సభలో మాట్లాడిన రాహుల్.. రైతులకు హక్కులు కల్పించాలని, మృతి చెందిన అన్నదాతల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సాగు చట్టాలపై జరిపిన పోరాటంలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని లోక్ సభలో రాహుల్ పేర్కొన్నారు. ఆ రైతుల వివరాలను సభకు ఆయన అందజేశారు. మృతుల్లో 400 మంది రైతులు పంజాబ్ కు చెందిన వారని, 70 మంది హర్యానాకు చెందిన వారని రాహుల్ తెలిపారు.