Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువుగారూ.. మీరు చేసింది కరెక్ట్ కాదు.. పవన్ బాధ?: పూరీ జగన్నాథ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణమని తెలిశాక.. సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు వర్మపై దుమ్మెత్తిపోస్తున్నారు. వివాదాల చుట్టూ తిరిగే వ

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (16:35 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణమని తెలిశాక.. సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు వర్మపై దుమ్మెత్తిపోస్తున్నారు. వివాదాల చుట్టూ తిరిగే వర్మ పవన్‌ను పదేపదే టార్గెట్ చేయడం సబబు కాదని మండిపడుతున్నారు. ఈ జాబితాలో వర్మ శిష్యుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా చేరిపోయాడు. 
 
తనకు పవన్ కల్యాణ్ జీవితాన్నిచ్చాడని.. అలాంటి వ్యక్తి బాధపడటం తనకు చాలా బాధను మిగిల్చిందని పూరీ తెలిపాడు. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూడలేదని.. వర్మ చేసిన పని తనకు ఏమాత్రం నచ్చలేదని.. ప్రాణం ఉన్నంత వరకూ తాను పవన్‌కి సపోర్ట్ చేస్తానని పూరీ ట్వీట్ చేశాడు. కాగా.. రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడిగా, సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్‌ కూడా తాను పవన్‌ కల్యాణ్‌కే మద్దతివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
ఇదిలా ఉంటే.. దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాట విని సినీనటుడు పవన్‌ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీరెడ్డి వ్యాఖ్యలను హైలెట్‌ చేస్తూ డిబేట్లు నిర్వహించిన టీవీ ఛానెళ్లపై పవన్ కల్యాణ్‌ ఫైర్ అవుతున్నారు. శుక్రవారం ఫిలిమ్ ఛాంబర్‌లో న్యాయవాదులను కలిశారు. అనంతరం పవన్ ట్వీట్ చేస్తూ.. మహాన్యూస్‌ టీవీకి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి లేక ఆయన బినామి నుంచి ఫండ్స్‌ వస్తున్నాయి. 
 
తన తల్లిపై అభ్యంతరకరంగా డిబేట్లు నిర్వహించినందుకు గానూ వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని పవన్ హెచ్చరించారు. మహాటీవీ సీఈవోతో పాటు ఎడిటర్ మూర్తి కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదంటూ పవన్ ట్వీట్ చేశారు. కాగా, టీవీ9 రవి ప్రకాశ్‌, శ్రీని రాజులపై కూడా పవన్ ట్వీట్ చేశారు. ఆయన కొత్త ఫొటో ఇదంటూ.. ఆయనకు టీవీ9లో 88.69% షేర్‌ ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments