పవర్ స్టార్ కనిపించలేదా..? ఏమైయ్యాడు..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (10:45 IST)
తెలుగు పవర్ స్టార్ అంటే పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే విధంగా తమిళ పవర్ స్టార్‌గా పేరున్న శ్రీనివాసన్ ప్రస్తుతం అదృశ్యమయ్యాడని భార్య జూలీ ఫిర్యాదు చేసింది. తర్వాత ఊటీలో ఉన్నాడని తెలియడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే..  పోలీసులకు తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ భార్య జూలీ ఫిర్యాదు చేసింది. అయితే అతడు ఊటీలో వున్నాడని తెలుసుకున్నాక.. గంటల వ్యవధిలోనే ఈ కేసును ఉపసంహరించుకుంది. పవర్ స్టార్ ఊటీకి వెళ్లేందుకు కారణం అతనిపై కేసులుండటమేనని పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాసన్‌పై న్యూఢిల్లీతో పాటు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. 
 
ఇటీవల ఓ వ్యక్తి డబ్బు విషయంలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆయన కనిపించలేదని ఫిర్యాదు రావడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. కానీ ఊటీలో వున్నాడని తెలుసుకున్న జూలీ శ్రీనివాసన్‌ను కలిసేందుకు వెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments