నరేంద్ర మోడీకి రాం.. రాం.. : దీర్ఘాలోచనలో ఆర్ఎస్ఎస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే ఎన్నికల్లో టాటా చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా ప

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (08:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే ఎన్నికల్లో టాటా చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మరో నేతను ఎంపిక చేసే పనిలో ఆర్ఎస్ఎస్ నేతలు నిమగ్నమైవున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం.
 
దీనికి పలు కారణాలు లేకపోలేదని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, గత 2014తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ మూటముల్లె సర్దుకోవడం ఖాయమన్న అంచనాకు వచ్చింది. ప్రధాని అభ్యర్థిగా మోడీకి మద్దతు లేకపోతే, ఆయన స్థానంలో మరొకరిని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఆయనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని ఎదుర్కొనే విషయంలోనూ బీజేపీ తీరుపై ఆరెస్సెస్ అసంతృప్తిగా ఉంది. వారం రోజుల క్రితం హర్యాణాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన బీజేపీ, ఆరెస్సెస్ నేతల మధ్య మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charmee Kaur: విజయ్ విజయం.. త్రిష లక్కీ మస్కట్ అన్న ఛార్మీ కౌర్

సుమంత్ ప్రభాస్ నటించిన గోదారి గట్టుపైనా వేసవి ప్రోమోలు చల్లబరుస్తున్నాయి

Fauji: రాము చనిపోవడంతో ఫౌజీ సినిమా సెట్లో విషాదం - షూటింగ్ వాయిదా

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి పదిహేను లక్షలు విరాళం ప్రకటించిన మోహన్ బాబు

Trisha: విజయ్ వదిలేసిన స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా త్రిష పోటీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

తర్వాతి కథనం
Show comments