Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను విష వలయంలోకి పంపా.. జాగ్రత్తగా చూసుకోండి ప్రియాంకా భర్త

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:50 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తూర్పు విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి సోమవారం లక్నో వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ యూపీలో ప్రకంపనలు సృష్టించింది. రాహుల్, ప్రియాంకా గాంధీ కలిసి నిర్వహించిన ఈ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా ఓ ప్రకటన చేశారు. తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూనే, తన భార్యను విష వలయంలోకి పంపించానని, అందువల్ల ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 
 
"భారతదేశ ప్రజలకు సేవ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లో ఓ కొత్త ప్రయాణం ఆరంభిస్తున్న ప్రియాంకా! నీకు నా శుభాకాంక్షలు. నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి, చక్కని భార్యవి, మన పిల్లలకు గొప్ప తల్లివి" అని ఆయన ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో అభినందించారు. 
 
'కక్షలతో కూడిన విషపూరితమైన రాజకీయ వాతావరణం ఇపుడు నెలకొని ఉంది. కానీ దేశ ప్రజలకు సేవ చేయడం ఆమె బాధ్యత. నేనామెను ఈ దేశ ప్రజలకు అప్పగిస్తున్నాను. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి' అని ఆయన భావోద్వేగంతో కూడిన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
వాద్రా ఇలాంటి పోస్టే జనవరి 23న కూడా ఒకటి పెట్టారు. ఆమెను ప్రధాన కార్యదర్శిగా రాహుల్‌ నియమించిన రోజున కంగ్రాట్స్‌ చెబుతూ. 'నీ జీవితంలోని ప్రతీ దశలోనూ నేను వెన్నంటి ఉంటా.. ఈ దేశానికి నువ్వు చేయగలిగినంత సేవ, మంచి చెయ్' అంటూ ఆ ట్వీట్‍లో పేర్కొన్నారు. వాద్రా చేసిన ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments