Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి రిజిస్టర్ చేసుకోని ఎన్నారైలూ... పారాహుషార్

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:49 IST)
సోమవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎన్ఆర్ఐల వివాహ నమోదు బిల్లు 2019 ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎన్నారైలు భారతదేశంలోని మహిళలను లేదా ఎన్నారై మహిళలను వివాహం చేసుకున్నట్లయితే, వివాహమైన 30 రోజులలోపు రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వారి పాస్‌పోర్ట్ రద్దు చేయబడుతుంది. 
 
అంతేకాకుండా ఇందులో దోషులుగా నిర్ధారణ అయితే, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. ఎన్నరైల చేతుల్లో పెళ్లి పేరుతో మోసపోతున్న మహిళలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లి చేసుకుంటే ఇక్కడి అధికారుల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి లేదా విదేశాలలో పెళ్లి చేసుకునేట్లయితే అక్కడి అధికారులతో రిజిస్టర్ చేయించుకోవాలి.
 
లేదంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ద్వారా న్యాయస్థానాలు సమన్లు జారీ చేస్తాయి. ఇందుకు సంబంధితంగా పాస్‌పోర్ట్ చట్టానికి, నేర శిక్షాస్పృతికి కూడా సవరణలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments