Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్‌కి పవర్ లేదు... సైకిల్‌కి ట్యూబ్‌లు లేవు... పవన్ కళ్యాణ్ సెటైర్లు

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (17:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జోరు ఊపందుకుంటోంది... ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.


ఈ మేరకు కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ, ‘వాళ్లు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులా లేకపోతే బెట్టింగ్ రాయుళ్లా? మీకెందుకు ఎమ్మెల్యే టికెట్లు, క్లబ్‌లో కూర్చొని పేకాట ఆడుకోండి. పోలీసులను బెదిరించే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా?’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
ఈ సందర్భంగా సభకు హాజరైన అభిమానులు వేసిన ప్రశ్నలకు పవన్ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వైకాపా ఎన్నికల గుర్తుగా ఉన్న ‘ఫ్యాన్’ కు రెక్కలైతే విరగలేదు కానీ అది తిరగడానికి ‘పవర్’ లేదు అని చెప్తూ... పనిలో పనిగా ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవని, ఇది వరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవారని, ఇప్పుడు భుజాన వేసుకుని మోసుకొస్తున్నారంటూ టీడీపీపై కూడా సెటైర్లు వేసేసారు.

ఇంతకీ సైకిల్ తొక్కుకుంటూ రాలేకపోవడానికి గల కారణంగా... కేసీఆర్‌ని పేర్కొనడం ఇక్కడ విశేషం...  కేసీఆర్ సదరు సైకిల్ చైన్‌ని ఎప్పుడో తెంచేసారనీ, చైన్ లేకుండా సైకిల్ తొక్కినా కూడా ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
సెటైర్లయితే బాగానే ఉన్నాయి కానీ... సభలకు వచ్చిన జనాలందరూ ఓట్లేసేస్తారనుకున్న మెగా అన్నగారి అనుభవాన్ని ఈ తమ్ముడు కాస్త గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments