పవన్ సంచలన వ్యాఖ్యలు.. గొడ్డలి పట్టుకుని స్మగ్లింగ్ చేయడం హీరోయిజమా?

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గురువారం విలేకరుల సమావేశంలో సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కథానాయికలను అడవుల రక్షకులుగా చిత్రీకరిస్తూ ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 
 
గొడ్డలి పట్టుకుని స్మగ్లింగ్‌లో పాల్గొనడం నేటి సినిమాలో హీరోయిజానికి కొత్త నిర్వచనంగా మారిందన్నారు. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని చెప్పారు. అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని చెప్పారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రేతో సమావేశమై ఏడు అంశాలపై చర్చించారు. 
 
చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం 8 కుమ్కీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక హీరోయిజంపై పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పుష్ప 2ను ఉద్దేశించినవే అవుతాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments