Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ రీ-ఎంట్రీ... ఇది నిజ‌మేనా..? లేక పుకారా..?

Webdunia
బుధవారం, 8 మే 2019 (22:03 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించడం... జ‌న‌సేన పార్టీ తరపున ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం తెలిసిందే. ఎన్నిక‌లు ముగిసాయి. అంద‌రూ మే 23న రానున్న ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.... ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌నున్నారు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త విని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నా...ఇది నిజ‌మా..? లేక పుకారా..?  అనేది తెలియ‌క అభిమానులుకు ఎలా రియాక్ట్ కావాలో తెలియ‌డం లేదు. 
 
ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రెడీగా ఉన్నారు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం. బ‌లంగా వినిపిస్తున్న‌ వార్త ఏంటంటే... ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తుంద‌ట‌. ఈ సంస్థ ప‌వ‌న్‌కు 30 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేసింద‌ని.. 40 రోజుల డేట్స్ ఇచ్చేందుకు ప‌వ‌న్ అంగీక‌రించార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్థంలో ఈ సినిమాని ప్రారంభిస్తార‌ని... అయితే.. ఈ మూవీకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టించ‌నున్నారు అంటూ గ‌తంలో వార్త‌లు వ‌స్తే... ప‌వ‌న్ వెంట‌నే వాటిని ఖండించారు. ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌ొద్దు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మ‌ళ్లీ కొత్త‌గా ప‌వ‌న్ సినిమా చేయ‌నున్నాడు అంటూ ప్ర‌చారం ప్రారంభ‌మైంది. మ‌రి.. ఈసారి కూడా ప‌వ‌న్ స్పందించి క్లారిటీ ఇస్తారా..? అని కొంతమంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి.. ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments