Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:00 IST)
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసును ఆది నుంచి విచారిస్తూ వచ్చిన అహుజాపై బదిలీ వేటు వేసి, ఈ కేసును విచారించేందుకు కొత్త అధికారిని నియమించింది. దీంతో ఈ కేసు విచారణ మొదటి నుంచి సాగనుంది.
 
అదేసమయంలో ఈ స్కామ్‌లో చిదంబరం వద్ద విచారించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించింది. చిదంబరం వద్ద విచారించేందుకు సీబీఐ అధికారులు  100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం.
 
మరోవైపు, చిదంబరం అరెస్టు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరివరకు పోరాడుతామని తెలిపింది.
 
కాగా, ఈ కేసులో చిదంబరంను బుధవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రంతా చిదంబరంను ఉంచారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments