Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఆశ చూపి... ఆరేళ్ల చిన్నారిపై అరవైయేళ్ళ వృద్ధుడు అత్యాచారం

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (13:43 IST)
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ళ చిన్నారిపై అరవైరెండేళ్ళ వృద్ధ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
62 ఏళ్ల వృద్ధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాతయ్యలాంటోడని నమ్మితే.. ఏ పాపం తెలియని చిట్టితల్లిపై మృగంలా రెచ్చిపోయాడు. ఇదేంటని నిలదీస్తే, డబ్బులిస్తా... గొడవ చేయొద్దు అంటూ తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘోరం శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
 
మందస మండలానకి చెందిన గొరకల రుషి అనే 62 యేళ్ల వృద్ధుడు.. తన ఇంటి పక్కనే ఆడుకునే ఆరేళ్ళ చిన్నారిని చాక్లెట్ ఆశ చూపించాడు. దీంతో ఆ చిన్నారి తాతయ్యా అంటూ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అసలు విషయాన్ని వెల్లడించారు. 
 
దీంతో తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, పంచాయతీ పెద్దల ముందు రుషి చేసిన తప్పును అంగీకరించాడు. పైగా, తాను చేసిన దారుణానికి పరిహారంగా సెటిల్మెంట్ చేసుకుందాన్న ప్రతిపాదన తెచ్చారు. దీనికి ససేమిరా అన్న పోలీసులు.. సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి, కామాంధుడిని అరెస్టు చేశారు. అత్యాచానికి గురైన బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments