Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 యేళ్ల వయసు కలిగిన భారత ప్రభుత్వం కనిపించడం లేదు...

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (09:46 IST)
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతుంటే వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. కరోనా రోగులతో దేశంలోని ఆస్పత్రులన్ని ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని నడిపించాల్సిన ప్రధానమంత్రి ఇపుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. ప్రస్తుతం దేశంలో ఈ దుర్భర పరిస్థితికి ప్రధాని మోడీతో పాటు.. ఆయన కుడిభుజమైన హోం మంత్రి అమిత్ షానే కారణమని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో మోడీ - షాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ, వారిద్దరి వైపు నుంచి ఎలాంటి చలనం లేదు. 
 
ఈ క్రమంల ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఔట్‌లుక్ తన కవర్ పేజీలో ముద్రించిన ఫోటో ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. కొవిడ్‌ విలయంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందుబాటులో లేక, ప్రాణాధార ఔషధాలూ కరువైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కవర్‌పేజీని ఇలా రూపకల్పన చేశారు.  'ఏడేళ్ల వయసు' కలిగిన 'భారత ప్రభుత్వం' కనిపించడం లేదని.. ఆచూకీ తెలిసిన వారు పౌరులకు తెలియజేయాలంటూ వ్యంగ్యంగా రూపొందించారు. ఈ కవర్‌పేజీ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments