Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రెచెర్ లేదనీ... దుప్పట్లో పేషెంట్‌ను పడుకోబెట్టి ఈడ్చుకెళ్లారు... (Video)

దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితికి ఇది మరో మచ్చుతునక. మహారాష్ట్రలోని నాంధేడ్ ప్రభుత్వ పెద్దాసుపత్రిలో నడవలేని రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రక్చర్ లేదా వీల్‌చైర్ లేకపోవడంతో దుప్పట్లో పడుకోబెట్టి ల

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (16:12 IST)
దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితికి ఇది మరో మచ్చుతునక. మహారాష్ట్రలోని నాంధేడ్ ప్రభుత్వ పెద్దాసుపత్రిలో నడవలేని రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేదా వీల్‌చైర్ లేకపోవడంతో దుప్పట్లో పడుకోబెట్టి లాక్కెళ్లారు. ఇది ఆ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
శనివారం ఉదయం నాంధేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను వాహనంలో ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ మహిళ నడవలేని స్థితిలో ఉండటంతో స్ట్రక్చర్ లేదా వీల్‌చైర్ కోసం ఆమె వెంట వచ్చినవారు ఆస్పత్రి ప్రాంగణంలో వెతికారు. 
 
వైద్యులను, సిబ్బందిని అడిగారు. వారి నుంచి స్పందన లేదు. పైగా, ఆ మహిళను మోసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక చేసేదేం లేక ఆ మహిళను దుప్పటిలో పడుకోబెట్టి ఈడ్చుకెళ్లారు. ఇది కెమెరా కంట్లో పడింది. 
 
రూ.లక్షల కోట్లు నిధులు ఆస్పత్రులకు ఇస్తున్నా.. ఇప్పటికీ ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. వీల్‌చైర్ కూడా లేకపోవటం ఏంటీ.. ఆస్పత్రిలోనే ఈ ఈడ్చుకెళుతున్నారు అంటే.. సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయని నిలదీస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments