Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబానీ కుటుంబం లండన్‌లో స్థిరపడుతుందన్న వార్తలు నిరాధారం: రిలయన్స్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (22:40 IST)
ముకేశ్ అంబానీ లండన్‌లో స్థిరపడుతున్నారనే వార్త నిరాధారమైనదని, అతీతమైనదని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. లండన్‌లోని స్టోక్ పార్క్‌లో ఉన్న తన రెండవ ఇంటిని కుటుంబ సమేతంగా ముకేశ్ అంబానీ సెటిల్ చేయబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలు అవాస్తమైనవనీ, తప్పుదారి పట్టించేవిగా కంపెనీ పేర్కొంది.

 
ఇటీవల, ఒక వార్తాపత్రిక లండన్‌లోని స్టోక్ పార్క్‌లో పాక్షికంగా స్థిరపడాలని అంబానీ కుటుంబం యోచిస్తున్నట్లు నివేదించింది. ఇది వాస్తవాలకు అతీతంగా ఉందని కంపెనీ తెలిపింది. ఈ వార్త వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ ఊహాగానాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

 
కంపెనీ ఒక ప్రకటనలో, “రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఆయన కుటుంబానికి లండన్ లేదా ప్రపంచంలోని మరే ఇతర భాగానికి మకాం మార్చడానికి లేదా నివసించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. రిలయన్స్ గ్రూప్ యొక్క RIIHL లండన్‌లోని స్టోక్-పార్క్ ఎస్టేట్‌ను కొనుగోలు చేసింది. హెరిటేజ్ ప్రాపర్టీని గోల్ఫింగ్ మరియు స్పోర్టింగ్ రిసార్ట్‌గా మార్చాలని యోచిస్తోంది.

 
ఈ కొనుగోలు గ్రూప్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల వ్యాపారానికి జోడిస్తుందని కంపెనీ తెలిపింది. దీనితో పాటు, ఇది భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments