Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ విక్రమ్... సిగ్నల్ బ్రేక్ చేసినందుకు నీకు ఫైన్ వేయంగానీ (video)

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (09:26 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా చివరి క్షణంలో సఫలంకాలేక పోయింది. అయినప్పటికీ.. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని దేశం యావత్తూ గుర్తించి శ్లాఘిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్ గురించే ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 
 
చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు నిర్వహించే నిమిత్తం ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. చంద్రుడి ఉపరితలంపై సాఫీగా అడుగుపెట్టాల్సిన విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ కారణంగా సంబంధాలు తెగిపోయాయి. ఈ అనూహ్య పరిణామం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది. 
 
అయితే, ఇంతటి నిరాశాజనకమైన అంశంలోనూ నాగ్‌పూర్ పోలీసులు హాస్యచతురత ప్రదర్శించారు. "డియర్ విక్రమ్, దయచేసి రెస్పాండ్ అవ్వు. 'సిగ్నల్స్' బ్రేక్ చేసినందుకు నీకేమీ చలాన్లు వేయడంలేదులే!" అంటూ చమత్కరించారు. నాగ్‌పూర్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం