Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మై బ్రదర్ ది బెస్ట్', కానీ ఇలా అవుతుందని అనుకోలేదు: సాయితేజ తమ్ముడు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (20:33 IST)
అన్నను చూసే ఆర్మీలో చేరాను. ఆయన పట్టుదల, కృషే నన్ను ఆర్మీ వైపు నడిపించాయి. మెరుపు వేగంతో శత్రువులను మట్టికరిపించగల వ్యక్తి మా అన్న. చిన్న గ్రామంలో పుట్టిన మేము దేశ రక్షణకు వెళతామని ఊహించలేదు. కానీ దేశ భద్రతలో మేము భాగస్వామ్యులు కావాలనుకున్నాము. వెళ్ళాము. 

 
కానీ మా అన్న ఇలా మధ్యలోనే వెళ్ళిపోతాడని ఊహించలేదు. మా అన్న లేడన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటున్నాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆర్మీ అధికారి సాయితేజ తమ్ముడు మహేష్ బాబు. 

 
అన్న మరణ వార్త తెలుసుకున్న తమ్ముడు హుటాహుటిన సిక్కిం నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. సిక్కింలో ఆర్మీలో పనిచేస్తున్నాడు మహేష్. ఉన్నఫలంగా స్వస్థలంకు చేరుకున్నాడు. మా అన్నే మా కుటుంబానికి పెద్ద దిక్కు. ఆయన అకాల మరణం చెందుతారని అనుకోలేదు.

 
రేపు సాయంత్రానికి భౌతికకాయం స్వగ్రామానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మృతదేహాలు చెల్లాచెదురు కావడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే గానీ మృతదేహాలను ఎవరివన్నది గుర్తుపట్టలేమని ఆర్మీ అధికారులు చెప్పారు.

 
మంచి పట్టుదలతో చిన్నస్థాయి నుంచే బిపిన్ రావత్ వద్ద స్పెషల్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తించారు. ఇది మా కుటుంబానికి గర్వకారణమే. కానీ ఆయన అకాల మరణం చెందడం మాత్రం బాధిస్తోందన్నారు సాయితేజ తమ్ముడు మహేష్ బాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments