ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (20:31 IST)
నందిగామ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం జంగోనిగూడ గ్రామానికి చెందిన శ్రీధర్ (55), పఠాన్ చెరువు మున్సిపాలిటీకి చెందిన సురేష్ కుమార్ (30)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 
 
వీరిద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. 
 
వీళ్లు అయ్యప్పటెంపుల్ సమీపంలోకి వచ్చేసరికి.. షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుకు ఢీకొని, ఆ పక్కనే బైకుపై ఉన్న శ్రీధర్, సురేష్ కుమార్‌లను కూడా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments