Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మ్రియా ధ్వంసం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:05 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో వేల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. ప్రాణనష్టం అపారంగా జరుగుతుంది. ముఖ్యంగా, రష్యా సైనికులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా ఉన్న మ్రియాను రష్యా సైనిక దళాలు ధ్వంసం చేశారు. 
 
ఉక్రెయిన్ భాషలో మ్రియా అంటే కల. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోస్ దీనిని తయారు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా వినుతికెక్కింది. అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు స మీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌పోర్టుపై రష్యా సైనిక బలగాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో మ్రియా ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ దిమిత్రో కులేబా వెల్లడించారు. 
 
ఈ మ్రియా ధ్వంసంపై కూడా ఉక్రెయిన్ స్పందించింది. దీన్ని పూర్తిగా పునర్నిస్తామని స్పష్టం చేసింది. బలమైన, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామన ఉక్రెయిన్ ప్రభుత్వం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. రష్యా ధ్వంసం చేసింది కేవలం విమానాన్ని మాత్రమేనని, తమ మ్రియా ఎప్పటికీ నశించదని పేర్కొంటూ ఫోటోను షేర్ చేసింది.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments