Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి..? అత్తకు కోడళ్లు గుడి కట్టారా? నమ్మాలి.. నమ్మి తీరాల్సిందే..! (video)

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (14:23 IST)
mother-in-law
ఏంటి అత్తకు కోడళ్లు గుడి కట్టారా? ఇదెలా సాధ్యం.. ఈ వార్తను అస్సలు నమ్మేది లేదు అని చాలామంది అంటారు. కానీ ఇది నిజం. అత్తాకోడళ్ల మధ్య  సాధారణంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ కారణం లేకుండానే తిట్టుకుంటారు.  కానీ.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం అలా కాదు. బిలాస్ పూర్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో.. బిలాస్ పూర్- కోర్బా హైవే పక్కన ప్రపంచంలో ఎక్కడా లేని ఈ గుడి ఉంది. నిజమే కదా.. ప్రపంచంలో ఎక్కడైనా ఏ కోడలైనా అత్తకు గుడి కట్టిందా చెప్పండి.
 
కానీ.. రతన్ పూర్ గ్రామంలో గీతాదేవి కోడళ్లు అలాంటి గుడి కట్టారు మరి. అత్తంటే ఎంత ప్రేముండాలి చెప్పండి. అలా అని అత్త అమాయకురాలు కావచ్చు.
ఏమీ తెలీదు కావచ్చు అనుకోవడానికేం లేదు. మంచి నాలెడ్జ్ ఉన్న మహిళే. అయినా సరే.. తెలివితేటలు కోడళ్ల మీద ప్రదర్శించేది కాదంట గీతా దేవి. 11 మంది కోడళ్లని కన్న బిడ్డల్లా చూసుకుందంట. ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుందంట. కోడలంటే బిడ్డకంటే ఎక్కువ అనే అభిమానంతో ప్రేమగా చూసుకుందంట. 
 
రతన్ పూర్ ఏరియాలో.. గీతా దేవి అంటే.. అందరు అత్తలకీ ఆదర్శం అంట. ప్రతి కోడలూ నాకు కూడా ఇలాంటి అత్త ఉంటే ఎంత బావుండు అని ఫీలయ్యే వారట. మరి బయటి వారికే అంత నచ్చుతుందంటే.. సొంత కోడళ్లకి ఇంకెంత నచ్చుతుందో కదా. 
 
అందుకే.. ఆమె చనిపోయిన తర్వాత.. 2010 లో.. హైవే పక్కన గుడి కట్టారు కోడళ్లు. గుళ్లో విగ్రహం పెట్టి.. ఆ విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అప్పుడప్పుడూ బంగారు ఆభరణాలని కూడా మారుస్తూ కొత్తవి తీసుకొస్తారట. అంతేనా.. కట్టి వదిలేయలేదు. ఎప్పుడూ నీట్‌గా మేన్ టేన్ చేస్తారట. ప్రతి రోజూ కేర్ తీసుకుంటారట.
 
అంతటితో ఆగలేదు. ప్రతి నెలా అందరు కోడళ్లూ కలిసి వచ్చి.. అత్త భజనలు చేస్తారట. అత్త మీద కీర్తనలు కూడా పాడతారట. అత్తంటే అలా ఉండాలి అనే వాళ్లు అంటుంటే.. కోడళ్లంటే కూడా ఇలా ఉండాలి అనే వాళ్లూ అంటుంటారట.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments