మంకీపాక్స్ వ్యాప్తికి కారణమేంటి? టెడ్రోస్ ఏమంటున్నారు?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (10:11 IST)
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ భయపెడుతోంది. అనేక ప్రపంచ దేశాల్లో భారీ సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ బాలికకు ఈ వైరస్ సోకింది. అయితే, ఈ వైరస్ వ్యాప్తికి గల  కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ ఎక్కువగా సెక్స్ కారణంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలిపింది. 
 
అలాగే, మాట్లాడేటపుడు వెలువడే తుంపర్లు ద్వారా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అందువల్ల మంకీపాక్స్ వైకర్స సోకినవారు ఇతరులకు దూరంగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ కోరారు. 
 
ఇదిలావుంటే, ఇప్పటివరకు 29 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. గతంలో మంకీపాక్స్ లేని దేశాల్లోనూ ఇపుడు కేసులు వెలుగు చూడటం గమనార్హం. ఈ వైరస్ వల్ల ఆఫ్రికాలో ఇప్పటివరకు 66 మంది చనిపోయారని టెడ్రోస్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం