Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోం వర్క్ చేయలేదని కాళ్ళు చేతులు కట్టేసి మండుటెండలో మిద్దెపై పడేసిన తల్లి

Advertiesment
child torture
, గురువారం, 9 జూన్ 2022 (09:51 IST)
హోం వర్క్ చేయలేదన్న అక్కసుతో ఓ చిన్నారి పట్ల కన్నతల్లి కర్కశంగా నడుచుకుంది. కాళ్లు చేతులు కట్టేసి మిద్దెపై మండుటెండలో పడేసింది. ఆ చిన్నారి ఆర్తనాదాలు విని పక్కింటి వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలుడుని రక్షించారు. ఈ ఘటన ఢిల్లీలోని టుకుమీర్‌పూర్‌లో జరిగింది. 
 
ఒకటో తరగతి చదివే తన కుమారుడు హోం వర్క్ చేయలేదన్న కోపంతో రగిలిపోయిన కన్నతల్లి అతనిపట్ల కర్కశంగా నడుచుకున్నారు. బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి మిట్టమధ్యాహ్నం ఇంటి మిద్దెపై  వదిలేసింది. ఎండవేడిమికి తాళలేక ఆ బాలుడు బిగ్గరగా ఆర్తనాదాలు పెట్టాడు. ఈ కేకలు విన్న పక్కింటి వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిం ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కు ట్యాగ్ చేశారు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించి, బాలుడి తల్లిపై కేసు నమోదు చేశారు బాధితుడిని గుర్తించామని, బాలుడి తల్లిపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంటన్నర వ్యవధిలోనే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం : ఈవో ధర్మారెడ్డి