Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంకీపాక్స్ అంటే ఏమిటి.. అది ఎలా సోకుతుంది?

Webdunia
శనివారం, 21 మే 2022 (09:12 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోయింది. ఈ వైరస్ బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇపుడిపుడే ఈ వైరస్ నుంచి కోలుకుంటున్నాం. ఇంతలోనే మంకీపాక్స్ వైరస్ తెరపైకి వచ్చింది. అమెరికా, ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదేసమయంలో భారత్‌ను అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. మంకీపాక్స్ తొలి కేసు బ్రిటన్‌లో వెలుగు చూడగా, అక్కడ నుంచి శరవేగంగా వ్యాపించి స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికా వంటి దేశాలకు వ్యాపించింది. శుక్రవారం బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో పుట్టుకొచ్చాయి. 
 
ఇప్పటివరకు ఒక్క బ్రిటన్ దేశంలోనే 20కి పైగా మంకీపాక్స్ కేసులు ఉన్నాయి. స్పెయిన్‌లో 23 ఉన్నాయి. అయితే, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. 
 
మరోవైపు, మన దేశంలో మంకీపాక్స్ వైరస్ బారినపడినవారిని ఐసోలేషన్‌లో ఉంచాలని, వారి నమూనాలను సేకరించి, పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ వైరాలజీలోని బీఎస్ఎల్-4 పరిశోధనా కేంద్రానికి పంపాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కోరారు. 
 
అయితే, మంకీపాక్స్ వైరస్ ఇపుడు కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కాదు. గత 1958లోనే కోతుల్లో ఈ వైరస్‌ను గుర్తిచారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. ఇది కూడా ఓ మశూచి వంటిందే. మనషుల్లో మాత్రం తొలి కేసు 1970లో గుర్తించారు. ఆ తర్వాత మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలకే పరిమితమైంది. 
 
మంకీపాక్స్ లక్షణాలు ఏంటి..? 
ఈ మంకీపాక్స్ లక్షణాలను పరిశీలిస్తే, జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులతో ప్రారంభమై రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటాయి. 
 
ఎలా సోకుకుంది..? 
మంకీపాక్స్ సోకిన జంతువు కరిచినా లేదా ఆ ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. అలాగే, నోటి నుంచి వెలువడే తుంపర్లు ద్వారా కూడా విస్తరిస్తుంది. ఎలుకలు, ఉడతలు, చిట్టెలుకల ద్వారానూ వ్యాపిస్తుంది. 
 
మంకీపాక్స్ సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా ఆరగించానా ఈ వైరస్ సోకుతుంది. మశూచికి ఇచ్చే టీకాలే దీనిని నివారిస్తాయి. అయితే, ఈ వైరస్ సోకిన ప్రతి 10 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయే ఆస్కారం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 
 
ఇకపోతే, ఆఫ్రికాతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిలో కూడా మంకీపాక్స్ తాజాగా వెలుగు చూసింది. అంటే.. స్త్రీపురుషుల శారీరక శృంగారం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని బ్రిటన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ బారినపడి వారిలో యువకులే అత్యధికంగా ఉన్నారని, వారు అంతకుముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం