Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలా.. నిన్ను మిస్ అవుతున్నా.. జగన్ ట్వీట్

రాఖీ పండుగ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లు అందరికీ జగన్ ట్వీట్టర్‌లో రాఖీ పం

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (16:37 IST)
రాఖీ పండుగ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లు అందరికీ జగన్ ట్వీట్టర్‌లో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వ్యాఖ్యానించారు.
 
'షర్మిల.. రాఖీ పండుగ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నా. అన్నగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయ్. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లందరికీ మీ జగనన్న రక్షా బంధన్ శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 
 
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖలో ఉన్న జగన్ ఆదివారం ధారభోగాపురం వద్ద పార్టీ నేతలతో కలసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు మహిళా నేతలు జగన్ కు రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి ఆశీస్సులు పొందారు.
 
అలాగే, రక్షాబంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేతికి ఆయన చెల్లెళ్లు రాఖీలు కట్టారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు ఉపాసన ఓ ట్వీట్‌లో తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవి చేతికి రాఖీలు కట్టి.. మిఠాయి తినిపించారు. అక్షింతలు వేసి దీవించిన చిరంజీవి, వారికి కానుకలను అందజేసి.. స్వీట్ తినిపించారు. అనంతరం, చిరంజీవి తన చెల్లెళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు అని పేర్కొన్నారు. 
 
అలాగే, రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోడీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న మోడీ నివాసానికి పలువురు చిన్నారులు వెళ్లారు. ఈ సందర్భంగా మోడీ చేతికి రాఖీలు కట్టారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మోడీ.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments