Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారుకు.. అందులోని డబ్బుకు పార్టీకి నాకు సంబంధం లేదు : మంత్రి బాలినేని

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:29 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఎళావూరు వద్ద రూ.5 కోట్లతో పట్టుబడిన కారుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కారుకు, అందులోని డబ్బుకు పార్టీకి గానీ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. పైగా, తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. 
 
ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ.5 కోట్ల నగదుతో పాటు.. బంగారాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉంది. దీంతో ఈ కారులో ఉన్నది వైకాపా అక్రమ సంపాదన అని, ఆ నగదును పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments