Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు గొప్పతనం తెలుసుకుని చిరు ఏం చేసారో తెలుసా?

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:03 IST)
ఎస్పీ బాలసుబ్రమణ్యం.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి - ఎస్పీ బాలు.. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుచేత బాలును చిరంజీవి అన్నయ్యా అని పిలిచేవారు.
 
అయితే... ఏమైందో ఏమో కానీ చిరంజీవి బాలును అన్నయ్యా అని కాకుండా.. మీరు అని పిలవడం స్టార్ట్ చేసారట. ఇలా ఎందుకు పిలిచేవారో చిరంజీవి బయటపెట్టారు.
 
 దీని గురించి చిరంజీవి ఏం చెప్పారంటే... చెన్నైలో తామిద్దరి ఇళ్లు పక్కపక్క వీధుల్లోనే ఉండేవి. బాలు కారణంగానే తన పాటలు అంత పాపులర్ అయ్యాయి. నా కెరీర్ తొలి దశ నుంచి నన్ను అక్కున చేర్చుకున్న ఆయన్ను అన్నయ్య అని పిలిచేవాడ్ని.
 
తర్వాత కాలంలో బాలు ఎంత గొప్పవారో, ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో అర్థం చేసుకొని మీరు అని సంభోదించేవాడ్ని. మొదట్నుంచి నన్ను అన్నయ్య అని పిలిచేవాడివి. ఇప్పుడు కొత్తగా మీరు అని పిలిచి నన్ను దూరం చేయకు అనేవారు బాలు అని చిరంజీవి బాలుతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.
 
కమర్షియల్ స్టార్‌గా కొనసాగుతున్న తను.. మధ్యమధ్యలో ఆపద్బాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి లాంటి సినిమాలు చేయడానికి బాలు కూడా ఓ కారణం అన్నారు చిరంజీవి. నువ్వు మంచి నటుడివి.. రెగ్యులర్ కమర్షియల్ మూవీసే కాకుండా నీలో ఉన్న నటుడు బయటకు వచ్చే సినిమాలు చేయాలని చెప్పేవారు. ఆయన అలా చెప్పడం వలనే తను మంచి సినిమాలు చేయగలిగానని అన్నారు చిరంజీవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments