Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (20:20 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఆయనను ఆదివారం మరోమారు విచారణకు పిలిచిన సీబీఐ.. ఏకంగా ఎనిమిది గంటల పాటు విచారణ జరిపింది. ఈ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్య పాలసీ ఖరారు చేయడం వెనుక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరగడానికి మార్గం సుగమమం చేశారని సిసోడియాపై సీబీఐ ఆరోపణలు చేసింది. దీంతో ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని సిసోడియా ఆదివారం ఉదయం ప్రకటించారు. పైగా, జైలుకు వెళ్లేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
ఆయన చెప్పినట్టుగా ఆదివారం విచారణకు పిలిచిన సీబీఐ ఆయన్ను అరెస్టు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.  సిసోడియా విచారణ, అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేశారు. 
 
ఇదిలావుంటే సిసోడియా అరెస్టుపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. "దేవుడు నీకు అండగా ఉంటాడు మనీశ్.. రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీకు లభిస్తాయి. ఒక వేళ నువ్వుజైలుకు వెళ్లాల్సి వస్తే అది నీ దేశం కోసం, నీ సమాజం కోసమే జైలుకు వెళుతున్నట్టు అవుతుంది. జైలుకు వెళ్లడం శాపమేమీ కాదు. నీ వంటి మంచి వ్యక్తులకు అది శోభనిస్తుంది. త్వరలోనే జైలు నుంచి తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. మేమందరం నీకోసం ఎదురు చూస్తుంటాము" అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments