ప్రపంచంలో వింతైన కేసు : ఇటాలియన్ వ్యక్తి హెచ్‌ఐవీ, కోవిడ్, మంకీపాక్స్

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (08:33 IST)
ప్రపంచంలోనే వింతైన, అరుదైన కేసు ఒకటి నమోదైంది. ఒక వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్‌‍ఐవీ సోకింది. ఆ వ్యక్తికి జరిపిన వైద్య పరీక్షల్లో ఈ మూడు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి ఇటలీ దేశస్థుడు. ఈ వ్యక్తిలో ఈ మూడింటిని ఇటాలియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్‌లో ప్రచురితమైని సమాచారం మేరకు ఈ బాధితుడు ఇటీవల ఐదు రోజుల స్పెయిన్ దేశానికి వెళ్లి స్వదేశానికి వచ్చాడు. ఇంటికి చేరిన 9 రోజుల తర్వాత ఆయనకు జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నడుము వాపు తదితర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ లక్షణాలు కనిపించిన అనంతరం అతనికి మూడు రోజుల తర్వాత కరోనా సోకినట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సదరు వ్యక్తి ఎడమ చేతిపై దద్దుర్లతో పాటు బొబ్బలు కనిపించాయి. ప్రస్తుతం సిసిలీ తూర్పు తీరంలో ఉన్న కాటానియాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయగా అందులో హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. అలాగే, మంకీపాక్స్, కోవిడ్ కూడా సోకినట్టు వైద్యులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments