దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. 22 యేళ్ళ యువతికి ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి వచ్చిన 22 యేళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌కు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.
ఈ బాధితురాలు నైజీరియా దేశానికి చెందిన యుతే. ఆమె అక్కడ నుంచి భారత్‌కు వచ్చే ముందే మంకీపాక్స్ వైరస్ సోకివుంటుందని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈమె అనారోగ్యం బారినపడటంతో ఢిల్లీలోని ఎల్.ఎన్.జె.పి. ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తూ వచ్చారు.
ఇదిలావుంటే, పాజిటివ్ వచ్చిన నైజీరియా యువతితో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మహిళలుకాగా, ముగ్గురు పురుషులు. ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారని.. మిగతా నలుగురు ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.