ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి పది మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా 2136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఒకే రోజు ఏకంగా 10 మంది చనిపోవాడంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం హస్తినలో పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది.
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,815 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 16,561గా ఉంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,39,37కు చేరుకున్నాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.
అలాగే, ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,26,996 మంది చనిపోయారు మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.