ఇప్ప‌టికీ అదే మైకంలో ఉన్నాన‌ని చెప్పిన‌ మ‌హేష్ బాబు... ఏంటా మైకం..?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (12:34 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్ప‌టికీ అదే మైకంలో ఉన్నా అని ట్వీట్ చేసారు. ఇంత‌కీ దేని గురించి అంటారా..? క్రికెట్ గురించి. ప్ర‌పంచ క‌ప్ చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో ఇంగ్లాండు, న్యూజిలాండ్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఫైన‌ల్ మ్యాచ్ అనే కాదు.. ఏ మ్యాచ్‌లో అయినా ఓ జ‌ట్టు భారీగా స్కోర్ చేయ‌డం.. ఛేజింగ్‌కి దిగిన జ‌ట్టు టార్గెట్ అందుకోలేక త‌డ‌బ‌డ‌డం చూసాం.
 
లేదంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం.. లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమే తెలుసు. కానీ... 2019 వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ మ్యాచ్‌ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. చ‌రిత్ర‌లో నిలిచిపోయింది ఈ ఫైన‌ల్ మ్యాచ్. ఫైన‌ల్ మ్యాచ్ టై అవ్వ‌డ‌మే ఓ విశేషం అనుకుంటే... సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అవ్వ‌డం మరో విశేషం. 
 
విజయం కోసం ఇరు జట్లు ఎంతలా పోరాడాయో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. చివరకు ఎక్కువ బౌండరీలు కొట్టిన‌ ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు రుచించడం లేదు కానీ.. అత్యద్భుమైన క్రికెట్ మ్యాచ్ చూశామనే భావన మాత్రం అందరిలో ఉంది. 
 
ఈ మ్యాచ్ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... ఇప్పటికీ మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ.. న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిల్కీ బ్యూటీని అవమానించిన ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు?

Manchu Vishnu: షార్ట్ ఫిల్మ్ నుండి ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాశం కల్పిస్తున్న మంచు విష్ణు

Sharwa: సంక్రాంతికి శర్వా వస్తే అన్ని బాగుంటాయని మరోసారి రుజువైంది : హీరో శర్వా

Peddi: 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డులను బద్దలు కొట్టిన పెద్ది చికిరి చికిరి సాంగ్

Sprit: స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

తర్వాతి కథనం
Show comments