Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Breaking News: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా

Advertiesment
Breaking News: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా
, బుధవారం, 3 జులై 2019 (16:47 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్విటర్లో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా ఆయన వ్యాఖ్యానించారు. కొంతకాలంగా రాహుల్ రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా చాలా చర్చ జరుగుతోంది.

తాను పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్ ప్రకటించినప్పటికీ, పార్టీలోని సీనియర్లు, ఇతర నాయకులు ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, రాహుల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరని కథనాలు వచ్చాయి.
 
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తూ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. "పార్టీ అభివృద్ధి కోసం బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. అందుకే రాజీనామా చేస్తున్నా" అని రాహుల్ వెల్లడించారు.
 
లేఖలో రాహుల్ ఇంకా ఏమన్నారంటే...
తదుపరి అధ్యక్షుడిని నామినేట్ చేయాల్సిందిగా చాలామంది నన్ను కోరారు. కానీ నేను ఆ పని చేయడం సరికాదు. మా పార్టీకి ఎంతో ఘనమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ధైర్యంగా పార్టీని నడపగల వ్యక్తి ఎంపికలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోగలదని నేను నమ్ముతున్నా.
 
కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరాను. వాళ్లకు ఆ సామర్థ్యం ఉంది, వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. నా పోరాటం అధికారం కోసం కాదు. అలాగని బీజేపీపై ద్వేషం, కోపం కూడా లేవు. కానీ నా శరీరంలోని ప్రతి అణువూ దేశం గురించి బీజేపీ సిద్ధాంతాలను, ఆలోచనలను వ్యతిరేకిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థి మెడపై గొడ్డలిపెట్టి బెదిరించిన ఉపాధ్యాయుడు