Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సూది మందు సిద్ధం.. ఐదు రాష్ట్రాలకు తొలి బ్యాచ్ పంపిణీ!

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (16:31 IST)
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెమిడిసీవర్ సంస్థ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సూది మందును కనిపెట్టింది. ఈ సూది మందు తొలి బ్యాచ్‌ను త్వరలోనే ఐదు రాష్ట్రాలకు పంపించనుంది. 
 
కోవిఫర్‌ బ్రాండ్‌ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు వారాల్లో లక్ష ఇంజక్షన్లు తయారు చేయనున్నట్లు పేర్కొంది. 
 
తర్వాత బ్యాచ్‌ కరోనా ఔషధాన్ని కోల్‌కతా, ఇండోర్‌, భోపాల్‌, లక్నో, పాట్నా, భువనేశ్వర్‌, రాంచీ, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవాకు సరఫరా చేయనున్నట్లు హెటిరో వెల్లడించింది. 
 
100 మిల్లీగ్రాముల ఈ ఇంజక్షన్‌ ధర రూ.5,400గా హెటిరో తెలిపింది.  ప్రస్తుతం ఈ కరోనా ఇంజక్షన్‌ ప్రభుత్వం, దవాఖానల్లోనే అందుబాటులో ఉంటుందని, మందుల షాపుల్లో ఇప్పుడే లభించవని పేర్కొంది. 
 
మరోవైపు ఇదే జనరిక్‌ మందును తాము కూడా తయారు చేస్తున్నట్లు అమెరికా ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సిప్లా తెలిపింది. ఇంజక్షన్‌ ధర మాత్రం రూ.5000 లోపే ఉంటుందని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments