Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో వివాహం.. బంధువులకు.. వధూవరులకు మాస్కుల్లేవ్.. అసలేం జరుగుతోంది..?

Webdunia
సోమవారం, 24 మే 2021 (17:25 IST)
marriage
కరోనా, లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. అతికొద్దిమంది సమక్షంలో వివాహాలు జరుగుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు వివాహాలు లైవ్ స్ట్రీమింగ్‌లో జరిగిపోతున్నాయి. అయితే లాక్ డౌన్ సమయంలో ఓ జంటకు కొత్త ఆలోచన పుట్టింది. ఈ లాక్డౌన్‌లో ఆ జంట ఏకంగా విమానంలో పెళ్లి చేసుకుంది. విమానాన్ని అద్దెకు తీసుకుని విమానంలోనే పెళ్లి చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన రాకేష్-దక్షిణ జంట మధురై- బెంగళూరుకు విమానాన్ని బుక్ చేసుకుంది. అందులో కుటుంబ సభ్యులందరికీ టికెట్లను బుక్ చేశారు. అలా 161సీట్లు బంధువులతో నిండిపోయాయి. ఆపై ఆకాశంలో ఎగిరిన విమానంలో ఈ వివాహం జరిగింది. . ఆకాశంలో ఉండగా మంత్రోచ్చారణల మధ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు కట్టాడు. మధురై మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ విమానం చక్కర్లు కొట్టింది. అలా విమానంలో పెళ్లి తంతు ముగిశాక ఈ పెళ్లి బృందం బెంగళూరు నుంచి మధురైకి తిరిగి చేరుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఈ వివాహంలో కరోనా మార్గదర్శకాలు అమలు  ఎక్కడా కనిపించలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే కనిపించడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది. కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని విచారణకు ఆదేశించింది. 
 
పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments