Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ప్రియురాలి పెళ్లి జరిగిపోతోంది.. లాక్డౌన్‌లో పెళ్ళిళ్లు వాయిదావేయండి.. సీఎంకు వినతి

నా ప్రియురాలి పెళ్లి జరిగిపోతోంది.. లాక్డౌన్‌లో పెళ్ళిళ్లు వాయిదావేయండి.. సీఎంకు వినతి
, శుక్రవారం, 21 మే 2021 (14:39 IST)
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తన ప్రియురాలి పెళ్లి జరిగిపోతోందని, ఈ లాక్డౌన్ కాలంలో పెళ్లిళ్లు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు తనదైనశైలిలో స్పందిస్తున్నారు. 
 
ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో మే 25 వ‌ర‌కు లాక్డౌన్ విధించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే పెళ్లి ముహూర్తం పెట్టుకున్న వారు వివాహాన్ని త‌క్కువ మంది అతిథుల‌తో నిర్వహించాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, లాక్డౌన్‌లో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ వివాహం మ‌రో అబ్బాయితో జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న ఓ యువ‌కుడు ఆమె పెళ్లిని ఆపేందుకు చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.
 
క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అన్ని వివాహ వేడుక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆదేశించాల‌ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ట్వీట్ ద్వారా ఆయ‌న‌ కోరాడు. వివాహాలపై నిషేధం విధిస్తే, త‌న‌ ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుందని ఆయ‌న పేర్కొన్నాడు.
 
అలా చేస్తే సీఎంకు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పాడు. ప్రియురాలి వివాహం ఆపేందుకు మంచి ప్లాన్ వేశావంటూ అత‌డిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. క‌రోనా వేళ విధించిన లాక్‌డౌన్ గ‌ర్ల్ ఫ్రెండ్లు వ‌దిలించుకున్న బాయ్ ఫ్రెండ్ల‌కు ఇలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని జోకులు వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రఘురామ రాజు కాలికి ఫ్రాక్చర్ : వైద్య పరీక్షలో వైద్యుల నిర్దారణ